Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 లక్షల టన్నులకు గాను 24.98 లక్షల టన్నుల ఉత్పత్తి
- జీఎం ఎం.షాలెం రాజు
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణిలోనే బొగ్గు వెలికి తీయడంలో ఇల్లందు ఏరియాలోని జెకె 5 ఉపరితల గని ప్రత్యేకంగా నిలుస్తుందని జీఎం ఎం.షాలెం రాజు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గనికి ఇచ్చినటువంటి వార్షిక లక్ష్యాన్ని గడువులోపే సాధించి, ఉత్పత్తి సాధనలో ముందు వరుసలో ఉంటుందన్నారు. జెకె 5 ఉపరితల గనిలో 271 మంది ఉద్యోగులున్నారు. భద్రతాతో కూడిన ఉత్పత్తి కోసం ఉద్యోగులంతా కలిసికట్టుగా, ఒకరికి ఒకరు సహాయ సహకారాలతో ముందుకు సాగడంతోనే, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తు న్నారన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 63 రోజుల ముందుగానే నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంతో పాటు 102 శాతం ఉత్పత్తితో దూసుకుపోతుంద న్నారు. గత ఆర్ధిక సంవత్సరం 2021-22 గాను సంస్థ నిర్దేశించిన 20 లక్షల టన్నులకు గాను 24.98 లక్షల టన్నులను ఉత్పత్తి చేసిందని తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు నెల చివరి కల్లా జెకె 5 నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించింది.
వార్షిక లక్ష్యం : బొగ్గు ఉత్పత్తిలో ఆదర్శం
1.2021-22లో 20.00 లక్షల టన్నులు 24.98 లక్షల టన్నులు (డిసెంబర్ చివరి వారం లోనే), 2.2022-23లో 14.50 లక్షల టన్నులు 14.52 లక్షల టన్నులు (22.01.23 వరకు)
ఇల్లందు ఏరియా ప్రత్యేకం నిలుస్తుంది : జీఎం
ఇల్లందు ఏరియాలోని ఉద్యోగులంతా సమిష్టిగా ముందుకు సాగడంతో నిర్దేశిత ఉత్పత్తి సాధ్యమవుతుంది. సింగరేణి సంస్థ నిర్దేశించినటువంటి వార్షిక లక్ష్యాన్ని 63 రోజుల ముందే సాధించడం చాలా సంతోషంగా ఉంది. జెకె 5 ఉపరితల గని ఏరియాకు వెన్నేముకలా నిలుస్తుంది. లక్ష్యసాధనలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడం, ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అను నినాదంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నామని, వార్షిక లక్ష్యం సాధించడం కోసం కృషి చేసిన అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
కార్మికుల ఐక్యతతోనే ముందుకు- బొల్లం వెంకటేశ్వర్లు,ప్రాజెక్ట్ ఆఫీసర్
ఉద్యోగులంతా కలిసికట్టుగా ముందుకు సాగడంతోనే నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని సాధించామని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇచ్చిన గడువులోపే సాధించడం ఆనందంగా ఉందని, దీనికి కృషిచేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ముందస్తు ప్రణాళికలతోనే లక్ష్యసాధన : పులి పూర్ణచందర్,గని మేనేజర్
గనిలో ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటూ, లక్ష్య సాధనలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడం తోనే సంస్థా నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని 63 రోజులు ముందుగానే సాధించడం సంతోషంగా ఉంది.