Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
ఫేస్ బుక్ కన్నా పుస్తక పఠనం మిన్న అని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం సమితి సింగారం పంచాయతీలో సుమారు రూ.15 లక్షల వ్యయంతో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులు, యువజనులు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ల కన్నా పుస్తకాలు చదవడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అన్నారు. ప్రపంచ మేధావులందరూ పుస్తకాలు చదువుకొని గొప్పవారయ్యారని అన్నారు. ఈ డిజిటల్ లైబ్రరీని విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా యువకులకు ఎంతో గాను ఉపయోగపడుతుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. డిజిటల్ లైబ్రరీలో కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాల్ సంపూర్ణ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులకు తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల సందర్భంగా ఉద్యోగార్డుల కోసం సంబంధిత స్టడీ మెటీరియల్ను ఏర్పాటు చేసేలా రూపొందించమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, పీఏసీఎస్ చైర్మన్ కురి నాగేశ్వరరావు, సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి, ఎంపీటీసీ గాజుల రమ్య, పంచాయతీ రాజ్ డీఈ సైదులు రెడ్డి, ఈఓఆర్డీ పల్నాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడప అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.