Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వే టీములు మరోసారి సర్వేచేస్తాయి
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో 76 జీఓ ద్వారా ఇండ్ల క్రమబద్ధీకరణ చేసి, రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించడం జరిగిందని, అర్హులైన కొంత మంది పట్టాలు పొందలేక పోయారని వారికోసం మరోసారి సర్వే టీములు దరఖాస్తులు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి సర్వే చేసేందుకు మరో అవకాశం ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి భూభాగం అయిన సర్వే నెంబర్ 141, 142, 143 భూముల్లో నివసిస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారికి సర్వే చేసి అర్హులైన వారికి ఈ 76 జీఓ ద్వారా న్యాయం చేసి పట్టాలు అందచేయడం జరిగిందని తెలిపారు. పట్టణ పరిధిలో 1536 మంది ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సర్వే టీంలు అన్ని వార్డులకు పంపించి సర్వే చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సర్వేలో దాదాపుగా 450 మందిని మాత్రమే అర్హులుగా నిర్ణయించినట్టు తెలిపారు. దాదాపుగా ఇంకా వెయ్యి మంది అర్హులైన వారి దరఖాస్తులు సరైన కారణాలు లేకుండానే సర్వే బృందం తిరస్కరించినట్టు, సర్వే టీం వారికి అవగాహన లేక సరిగా సర్వే చేయలేదని, కొంతమంది అర్హుల దరఖాస్తులు తిరస్కరించినట్టు తమ దృష్టికి తీసువచ్చిన నేపద్యంలో మరోమారు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు ఇంట్లో లేనప్పుడు కొన్ని, ఇంటి పత్రాలు సరిగా పరిశీలించక కొన్ని తిరస్కరించినట్టు తెలిపారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కలెక్టర్‌తో చర్చింది 17 సర్వే టీంలు ఎంపిక చేస,ి ప్రతి ఇంటికి రీసర్వే చేసి అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తుదారులందరూ సరైన పత్రాలు సర్వే టీం వారికి చూపించి పట్టాలు పొందాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.