Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే టికెట్ కోసం కొంతమంది పార్టీలో చీలిక తీస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చుండ్రు విజరు
నవతెలంగాణ-చండ్రుగొండ
మండలంలో అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కలుగజేసుకొని పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు చుండ్రు విజరు కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గంలోనే చండ్రుగొండ మండలం అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉన్న మండలంగా రాష్ట్రస్థాయిలో పేరు ఉందన్నారు. ఇక్కడ మొదటిసారి నియోజకవర్గ ఏర్పడినప్పుడు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగిందన్నారు. అలాంటి పార్టీని కొంతమంది కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం మండలాల్లో కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతూ చీలికలు తెస్తూ పార్టీని బ్రస్టు పట్టిస్తున్నారన్నారు. దీనినే ఆసరాగా చేసుకొని మండలంలో కొంతమంది నాయకులు ఎవరికి వారే నేనే మండల అధ్యక్షుడిగా ప్రకటించుకుంటూ.. కార్యకర్తలను, అభిమానులను, అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మా మండలంపై ప్రత్యేక దృష్టి సారించి, పార్టీకి పూర్వం వచ్చేలా సమర్ధుడైన నాయకుడిని మండల అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. అదేవిదంగా రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రలో మండలం నుంచి కార్యకర్తలతో బయలుదేరి విజయవంతం చేస్తామని తెలిపారు.