Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పాత కలెక్టరేట్ ఆవరణలోని ఈ.వి.ఎంల గోదాంను జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని స్టోరేజ్ లోకి తరలిస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పర్యవేక్షించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని వైద్య కళాశాలకు కేటాయించిన నేపథ్యంలో కలెక్టరేట్ ఆవరణలోని గోదాములో ఉన్న ఈ. వి. ఎంలను శనివారం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. జిల్లాకు నూతనంగా వచ్చిన 2,603 బ్యాలెట్ యూనిట్ లు, 2034 కంట్రోల్ యూనిట్ లను జడ్పీ లోని స్ట్రాంగ్ రూములో భద్రపర్చి సిసి పుటేజీలను కలెక్టర్ పరిశీలించారు. ఈ.వి.ఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వర్తించే పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సి.సి.టి.వి కెమెరాల ద్వారా పరిశీలిస్తుండాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఈ.సి.ఐ.ఎల్ ఇంజనీర్లు భానుప్రకాష్, రాజుశేషు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరథ్, పంచాయతీరాజ్ ఈఈ కె.వి.కె. శ్రీనివాసరావు, ఎలక్షన్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు, రాంబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఆర్.ఎస్ పార్టీనుండి పగడాల నాగరాజు, బి.జె.పి నాయకులు విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నుండి గోపాలరావు, వై.సి.పి పార్టీకి చెందిన కష్ణమోహన్, సి.పి.ఐ పార్టీ నుండి లక్ష్మీనారాయణ, సి.పి.ఎం పార్టీ నుండి ప్రకాష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.