Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ సారూ మీరే మాకు దిక్కు
- గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయండి
- సర్పంచ్ గద్దల రమేష్
నవతెలంగాణ పాల్వంచ
నూతనంగా ఏర్పాటైన దంతేలబోరా ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీకి పక్కా భవనం లేక, అద్దె భవనం దొరకక గత్యంతరం లేని పరిస్థితులలో చెట్టు కిందనే గ్రామ కార్యకలాపాలను నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. అనేకసార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. పాల్వంచ మండలం దంతేలబోరా ఎస్సీ కాలనీ గ్రామపంచాయతీలో శనివారం సర్పంచ్ గద్దల రమేష్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 14వ సామాజిక తనిఖీకి సంబంధించిన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గద్దల రమేష్ మాట్లాడుతూ...బంగారు తెలంగాణలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రాజకీయ నాయకులు స్టేజిల పై ప్రసంగిస్తూ చెబుతున్నారు, మరి మాకు ఈ బంగారు తెలంగాణలో ఉన్న మా గ్రామపంచాయతీకి ఈ దుస్థితి ఏంటని అన్నారు. అభివృద్ధి అంటే చెట్టు కిందనే గ్రామ సభలు నిర్వహించడమా అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటు అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గాని ఎన్నోసార్లు కలిసి సమస్యలు చెప్పినా గాని ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కలెక్టర్ సార్ ఇక మీరే మాకు దిక్కు ఒక గ్రామ పంచాయతీని మంజూరు చేయండని కోరారు.
ఇకనైనా స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి పాల్వంచ మండలంలో పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఎలా పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, నిధులు, ఎలా ఇస్తున్నారో మా గ్రామ పంచాయతీకి కూడా అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏయి మంగు, డీఆర్పి రమ్యకృష్ణ, పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్, టీఏ శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, ఉప సర్పంచ్ వెంకట నరసమ్మ, వార్డు సభ్యులు శ్రీలత, లక్ష్మి, కో ఆప్షన్ సభ్యురాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.