Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గ వీటి సరళ
నవతెలంగాణ-కొత్తగూడెం
డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గ వీటి సరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఐద్వా జిల్లా వర్క్ షాప్ కొత్తగూడెం మంచి కంటి భవన్లో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్లో సరళ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని గతంలో కట్టిన అభయ హస్తం డబ్బులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు పేరిట పేద ప్రజల్ని ఇబ్బందులు పెడుతుందన్నారు. రుణం సకాలంలో కట్టని వారి ఆస్తులు జప్తులు చేస్తామని పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇది సరైన పద్దతి కాదని సూచించారు. కోవిడ్-19 కరోనా కాలంలో ప్రజలకు పనులు లేక చాలా ఇబ్బందులు పడి జీవనం సాగిస్తున్నామని, పుట్టిన పిల్లలను సాకలేక, ఇబ్బందులు పడి, కిస్తీ కట్టలేక పోతున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వాలు మాత్రం బడా వ్యాపారస్తులకి వేల కోట్లు ఎగవేస్తున్న కార్పొరేట్ శక్తుల గురించి పట్టించుకోవడం లేదని, పేదవాడు మాత్రం డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉంటే ముక్కు పిండి వసూళ్లకు చేసే విధంగా వారిని ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని, కట్టని వారికి జప్తులు చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తుందని, గతంలో కట్టిన అభయాసం డబ్బులు ఇంతవరకు తిరిగి ఎందుకు ఇవ్వలేదన్నారు. డ్వాక్రా రుణాలు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని, ఇచ్చిన రుణాలు మాఫీ చేయాలని, లేనియెడల ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి, ఆఫీస్ బేరర్స్ ఎస్.లక్ష్మి, డి.లక్ష్మి, వి.వాణి, ఎన్.లీలావతి, ఏ.ఇందిరా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.