Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర 7వ మహాసభలో ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా కార్యదర్శి బూర్గుల ప్రదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
బలమైన కార్మికోద్యమాలు నిర్మిద్దామని, సింగరేణి కాంట్రాక్టు కార్మిక హక్కులకై పోరాడుదామని ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా కార్యదర్శి బూర్గుల ప్రదీప్ అన్నారు. సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ 7వ, రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలోని ఉర్దూఘర్ షాది ఖానాలో ఆదివారం జరిగాయి. రాష్ట్ర మహాసభలకు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లకు చెందిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులు హాజరయ్యారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి ప్రదీప్ ప్రసంగించారు. ఒకనాడు దేశ బొగ్గు పరిశ్రమ జాతీయ పరిశ్రమగా ఉండేదని, ఈరోజు దేశ ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కులను, సౌకర్యాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందన్నారు. ఈ మహాసభలకు అమరవీరుల జెండాను రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందం ఎగరవేశారు. అమర సంతాపాన్ని రాష్ట్ర కార్యదర్శి ఏ.వెంకన్న ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో కందగట్ల సురేందర్, గౌని నాగేశ్వరరావు, మోత్కూరి మల్లికార్జున్, అశోక్, మొగిలి, యధగిరి, మల్లేష్, కోటిలింగం, అంజయ్య, శోభ, బుచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.