Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి, తల సేమియా, రక్తహీనతతో బాధపడుతున్న 75 మందికి ఆదివారం రెడ్ క్రాస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ జిల్లాలో రెడ్ క్రాస్ చేయాలను గుర్తించి అందజేసిన మెడల్స్ సంస్థలకు, సభ్యులకు అందజేశారు. భద్రాచలంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షలు ఆనాడు అందజేసిన మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ సేవలను గుర్తించి గోల్డ్ మెడలను బహుకరించారు. అదేవిధంగా ఆర్థిక సహకారాన్ని అందజేసిన ఐటీసీ పీఎస్పీడీ అధికారులకు, డాక్టర్ జి.వి.సుదర్శన్లకు గోల్డ్ మెడల్స్ అందించి సత్కరించారు. ఇతర సభ్యులకు కూడా మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, మాజీ ఎంపీ డాక్టర్ అజ్మీర సీతారామ నాయక్ మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, ఈవి శ్రీనివాస్, పాకాల దుర్గాప్రసాద్, బిపిఎల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చంగల్ రావు, వై.సూర్యనారాయణ, పల్లంటి దేశప్ప, బి.వెంకటరెడ్డి, తిప్పన సిద్ధులు, రాజారెడ్డి, హరిచంద్ర నాయక్, కల్వకూరి అబ్రహం, గోళ్ళ భూపతిరావు, చావా లక్ష్మీనారాయణ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ చంద్ర ప్రసాద్, డాక్టర్ భాను ప్రసాద్, డాక్టర్ జయ భారతి, వెంకటాచారి, చారు గుల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.