Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్ స్టేషన్ ముందు గంట సేపు ధర్నా
- ఏఈకి వినతి అందజేత
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఇటీవల త్రీ ఫేస్ విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయానికి మండల రైతులు కన్నెర్ర చేశారు. వ్యవశాయం ఆధారపడి జీవిస్తున్న మండల రైతాంగానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందజేయాలంటూ రోడ్డెక్కారు. సీపీఐ(ఎం), సీపీఐ పార్టీల అనుబంద రైతు సంఘాల ఆధ్వర్యంలో సుమారు 100 మంది రైతులు ఆదివారం దుమ్ముగూడెం సబ్ స్టేషన్ ముందు గల భద్రాచలం, చర్ల ప్రదాన రహదారి పై గంట సేపు ధర్నా నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రైతులు చేస్తున్న దర్నా వద్దకు ఏఈ మోహన్ రెడ్డి రావడంతో రైతులు విద్యుత్ సమస్యలపై నిలదీసి వినతి పత్రం అందజేశారు. ఏఈ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానన్నారు. ఈ సందర్బంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ మాట్లాడుతూ....మండలంలో చాలా మంది రైతులు విద్యుత్ మోటార్ల పై ఆధారపడి వ్యవశాయం సాగు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడం వలన వేసిన పంటలు ఎండి పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొడాలి లోకేష్ బాబు, సున్నం నర్సింహాచారి, బొల్లి సత్యనారాయణ, తాళ్లూరి ఆదినారాయణ, వేమన వెంకటేశ్వరరావు, కొండపల్లి కృష్ణ, కల్లూరి వెంకటేశ్వరరావు, నోముల రామిరెడ్డి, రావులపల్లి పృద్వి, ప్రసాద్, శంకర్, రాంబాబు, రాజు, అన్నెం శ్రీను, కొల్లి శ్రీను, రాజేష్, గోపాల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.