Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీరు మారకపోతే మా నిర్ణయం త్వరలో ప్రకటిస్తామని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. ఆదివారం మండలంలోని లక్ష్యా గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంపీపీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే టీడీపీ నుండి బీిఆర్‌ఎస్ పార్టీలో చేరిన నాటి నుండి బీిఆర్‌ఎస్ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులను, సీనియర్ నాయకులను పక్కనపెట్టి ఆయనతో వచ్చిన కొందరి నాయకులకు పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. పార్టీ కార్యక్రమంలోనూ ప్రభుత్వ పథకాలలోనూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులను విస్మరించి ఆయన విష్టానుసారంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎన్ని మార్లు తనకు విన్నవించినా తనలో ఎటువంటి మార్పు లేదన్నారు. పార్టీకి, పార్టీ క్యాడర్‌కు నష్టపెట్టే విధానాన్ని పలుమార్లు జిల్లా నాయకత్వానికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీకి జిల్లా ముఖ్య నాయకులకు తెలియజేసినట్టు తెలిపారు. అయినా తనలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే తీరు మారకపోతే మా నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ళ సత్యనారాయణ, సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు, ఆరుగురు సోసైటీ డైరెక్టర్లు, జిల్లా రైతు కోఆర్డినేటర్ మండల రైతు కోఆర్డినేటర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్య కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు.