Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు మెచ్చిన మంచి పత్రిక : జీఎం
నవతెలంగాణ-మణుగూరు
నిష్పక్షవార్తలకు నిదర్శనంగా నవతెలంగాణ ప్రజల గుండెల్లో స్థిర స్థాయికి నిలిచిందని బీటీపీఎస్ సీఈ బి.బుచ్చన్న అన్నారు. విమర్శలను ప్రశంసలుగా చేసుకొని ముందుకు సాగుతున్న నిజమైన తెలుగు దినపత్రిక నవతెలంగాణ అని, ప్రజలు మెచ్చిన మంచి పత్రిక ప్రజా సమస్యలపై రాజీ పడకుండా వార్తలు ప్రచురించే ఏకైక పత్రిక అని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఓటు జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఆదివారం 2023 నూతన క్యాలెండర్ని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ నవతెలంగాణలో విశ్లేషణా త్మక వ్యాసాలు ఉంటాయన్నారు. ప్రజలను రాజకీయ పరచడంలో నవతెలంగాణకు ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. నూతన క్యాలెండర్ ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉండదన్నారు. ఏడాదికి ఏడాది నూతన ఆకర్షణలతో పాఠకులను ఆకట్టుకుంటున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో దామల్ల వెంకన్న, గాజులవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.