Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
రైతులకు 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేసంగి రైతులు కరెంటు సౌకర్యం లేక ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రతి ట్రాన్స్ఫారానికి ఏపీ స్విచ్ బోర్డును అమర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఒకే దఫాలో రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కేరళ తరహాలో క్వింటాకు రూ.2800 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్, గోపగాని లక్ష్మీ నరసయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, గోగ్గల ఆదినారాయణ, వర్షా శ్రీరాములు, భూక్య శ్రీదేవి, గూగులోతు హేమని, జగ్గు, పోడియం రాంముర్తి, తదితరులు పాల్గొన్నారు.