Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఫార్మా కంపెనీలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని సీఐటీయూ జిల్లా సభ్యులు భుక్యా రమేష్, లిక్కి బాలరాజు అన్నారు. ఆదివారం కొత్తగూడెం తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కొత్తగూడెం శాఖ 9వ మహాసభ కొత్తగూడెం మంచి కంటి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో 2022కు సంబంధించిన నివేదికను ఎస్కే.ఎ.సి. పాషా ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.సిద్ధిక్ హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఫార్మా కంపెనీలు అవలంబిస్తున్న పని గంటల విధానాల గురించి తెలిపారు. సీఐటీయూ జిల్లా సభ్యులు భుక్యా రమేష్, లిక్కి బాలరాజు పాల్గొని మాట్లాడారు. సభ అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
నూతన కమిటీ : తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కొత్తగూడెం నూతన కార్యవర్గంలో నూతన అధ్యక్షునిగా సిహెచ్.కిరణ్ కుమార్, (హెటరో కంపెనీ) కార్యదర్శిగా ఎస్కెఏ.సి.పాష (అల్కెంలాబొరేటరీస్) కోశాధికారిగా జె.మధు బాబు, (అరబిందో ఫార్మా సిటికల్స్) ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.