Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 6 నుండి 14 వరకు 22వ జాతర మహోత్సవములు
- వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలి రానున్న భక్తులు
- తొమ్మిది రోజుల పాటు నిండు జాతర ఉత్సవాలు
- ప్రతి రోజు భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం
- రాత్రి పూట సాంస్కృతి కార్యక్రమాలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామంలో తర తరాలుగా వెలసిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి మహిమలు కలిగిన గ్రామ దేవతగా దిన దినాభివృద్ధి చెందుతోంది. కోరిన భక్తులకు కొంగు బంగారంగా వరాలిచ్చే తల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీష్‌ఘడ్ రాష్ట్రంలో తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. అంతటి మహిమలు కలిగిన శ్రీ ముత్యాలమ్మ జాతర ఉత్సవాలను ప్రతి రెండేళ్లకు ఒక సారి అంగరంగ వైభవంగా నిర్వ హించుకోవడం అనవాయితీగా వస్తోంది. అంతటి విశిష్టత కలిగిన శ్రీ ముత్యాలమ్మ జాతర మహౌత్స వాలకు జాతర ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుండి 14 వరకు 22వ జాతర ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించేం దుకు ఆలయ కమిటీ వారు సర్వ సిద్దం చేస్తున్నారు.
వేలాదిగా తరలి రానున్న భక్తులు
దుమ్ముగూడెం గ్రామంలో తర తరాలుగా వెలసిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మతల్లి 22వ జాతర మహౌత్సవాలకు భక్తులు వేలాదిగి తరలి రానున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు చత్తీష్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడకు అమ్మవారిని దర్శించుకోవడం కోసం రానున్నారు. దీంతో పాటు అమ్మవారికి పదుల సంఖ్యలో ఎన్నారైలు కూడా కలిగి ఉన్నారనే చెప్పవచ్చు. జాతర సమయంలో సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలుపుతున్నారు.
తొమ్మిది రోజుల పాటు నిండు జాతర
ఫిబ్రవరి 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ నిండు జాతర కొనసాగనుంది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఉదయం సాయంత్రం విశేష పూజలతో పాటు భక్తులు అందజేసిన పట్టు చీరలతో రెండు పూటలా ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు తీర్ద, ప్రసాదాలతో ఉచిత అన్నదానం అందజేస్తారు. భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీతో పాటు దుమ్ముగూడెం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. తొమ్మిది రోజుల పాటు రాత్రి పూట సినీ ఆర్టిస్టులచే సంగీత విభావరి, బుర్రకధ, హరికధా కాలక్షేపం వంటి అబ్బురపరచే సాంస్తృతిక కార్యక్ర మాలు వినోదం కోసం నిర్వహిస్తారు. అఖరి రోజు అమ్మవారి నిండు ఊరేగింపుతో పాటు పెద్ద ఎత్తున బాణసంచా, విచిత్ర వేషధారణలు వంటి కార్యక్ర మాలు ఏర్పాటు చేస్తారు. ఏది ఎమైన శ్రీ ముత్యాల మ్మ అమ్మవారి నిండు జాతర తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనుందనే చెప్పవచ్చు.
ముమ్మరంగా ఏర్పాట్లు : చుక్కా గణేష్ రెడ్డి (ఆలయ కమిటీ చైర్మన్)
దుమ్ముగూడెం గ్రామంలో వెలసిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ 22వ జాతర మహౌత్సములకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి నవతెలంగాణకు తెలిపారు. ఆలయ ప్రదాన గోపురంతో పాటు ఆలయం మొత్తం రంగులతో అలంకరణ, చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు కళా వేదిక, ఆలయ కమ్యూనిటీ హాలును సైతం రంగులతో సిద్దం చేయడం జరిగిందన్నారు. భీమవరం వారిచే విద్యుత్ లైటింగ్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు సిద్దం చేశామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీతో పాటు జాతర కమిటీ వారు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జాతరలో ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో కుండా సీఐ దోమల రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు తీర్ద, ప్రసాదాలు, అన్నదానం అందజేయడం జరుగుతుందన్నారు. రాత్రి పూట వినోదం కోసం సాంస్తృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.