Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజవర్గాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
- విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-మణుగూరు
కేసీఆర్‌తోనే దేశ రాజకీయాలలో వెలుగులు వస్తాయని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం శేషగిరి నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌తో దేశ రాజకీయాలలో వెలుగులు ఖాయమని, దేశ ప్రజల ఆకాంక్షితోనే బీఆర్ఎస్ ఉద్భవించినదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో భారీ సంఖ్యలో వివిధ పార్టీల నుంచి చేరారన్నారు. పార్టీలో చేరిన అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధినే దేశమంతా ఆచరిస్తుంది అన్నారు. గ్రామాలు పట్టణాలు అని తేడా లేకున్నా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంన్నారు. ప్రతి గులాబీ సైనికుడిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పినపాక నియోజకవర్గ ప్రజలు ప్రశాంతమైన పాలనను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని వారన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని గ్రామాల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణం అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నామని వారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పటివరకు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులు స్వయం సమృద్ధి సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోషణ నరసింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కోడి నాగేశ్వరరావు, మణుగూరు అధ్యక్ష, కార్యద ర్శులు ముత్యం బాబు, రామిడి రామిరెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అడపా అప్పారావు, నవీన్, బూర్గుల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.