Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.66 వేల విలువైన గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన సీఐ అబ్బయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
అక్రమంగా గంజాయి రవాణ చేస్తున్న యువకులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి సుమారు రూ.66 వేల విలువైన గంజాయి స్వాదీనం చేసుకన్నట్లు పట్టణ 3 టౌన్ సీఐ అబ్బయ్య తెలిపారు. శనివారం సాయంత్రం 3వ పట్టణ ఎస్ఐ సోమేశ్వర్ తన సిబ్బందితో రైతు బజారు వద్ద వహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారని, భద్రాచలం వైపు నుండి ఖమ్మం వైపు 2 బైకులపై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి నలుగురు ప్రయత్నించగా పోలీసులు పట్టుకొని వారి వద్దనున్న బ్యాగులు తనిఖీ చేయగా అందులో 3 కెజిల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. దాని విలువ రూ.66 వేలు ఉంటుందని చెప్పారు. వారిని విచారించగా సీలేరు నుండి ఖమ్మంకి తరలిస్తున్నట్లు, కాలేజ్ స్టూడెంట్స్‌కి అమ్మడానికి తీసుకువేళుతున్నారని ప్రాధమిక విచారణలో తేలిందని చెప్పారు. పట్టుబడ్డ నలుగురిలో జయశంకర్ జిల్లా కాటారం, ఇబ్రహీంపేట గ్రామస్థుడు అయిలపురం రఘుపతి, ఖమ్మం పాండురంగపురంకు చెందిన పొడకంటి హేమాన్ జీవన్ కుమార్, ఇబ్రహీంపేట గ్రామం, జయశంకర్ జిల్లాకు చెందిన గంధం అనిల్‌లు ఒక ముఠాగా ఏర్పడి అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. వీరు గతంలో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలో గంజాయి కలిగి ఉన్న కేసులలో జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. జైలుకు వెళ్లిన వారి ప్రవర్తన మార్చుకోకుండా మళ్ళీ గంజాయి అమ్మాలనే ఉద్దేశ్యంతో కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలంలో శ్రీనగర్‌లో జీవన్‌కు సంబంధించిన మరొక ఇంట్లో ఉంటూ అదే కాలనీలో రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంట్లో తాళం పగులగొట్టి ఇంట్లోకి దూరి బంగారు, వెండి నగలను దొంగిలించారని చెప్పారు. ఈ నెల 16న రాత్రిపూట సారపాకలో ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్‌ని, 21న భద్రాచలం సిఆర్పీఎఫ్ కాంప్ దగ్గర ఒక బైక్ ని దొంగిలించి అవే 2 బైక్‌ల మీద సీలేరు వెళ్లి అక్కడ కరణం సాయి అనే వ్యక్తి దగ్గర గంజాయి కొన్నారని, తిరగి అవే 2 బైక్ లపై నలుగురు ఖమ్మం వెళ్తుండగా కొత్తగూడెంలో పట్టు బడ్డారని వివరించారు. అదుపులోకి తీసుకున్న నలుగురిని వైద్య పరీక్షల అనంతరం కొత్తగూడెం కోర్ట్ లో హాజరు పరచినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కొత్తగూడెంలో గంజాయి సేవించే వాళ్ళ జాబితా తయారు చేయబడిందని, త్వరలోనే వారందరిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.