Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రెస్ మీట్లో మాజీ ఎంపీ సీతారాం నాయక్
నవతెలంగాణ-భద్రాచలం
సీఎం కేసీఆర్ రోషమున్నోడని, అందుకే తెలంగాణ ఉద్యమంలో విజయకేతనం ఎగురవేశాడని, లక్ష్యాన్ని సాధించారని, దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో...మళ్లీ దేశ ప్రగతిని కాంక్షిస్తూ జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారని, జాతీయ రాజకీయాల్లో సునామీ సృష్టించటం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంటు మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ వ్యాఖ్యానించారు. భద్రాచలంలో ఆదివారం ఆయన పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి, దేశ ప్రగతిని నీరుగార్చారని, తద్వారా యావత్ భారత దేశ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ దారుణమైన జీవితాలను అనుభవిస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు, సీనియర్ నాయకులు తిప్పనసిద్దులు, పార్టీ మాజీ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జి మానే రామకృష్ణ, భద్రాచలం గ్రంథాలయం చైర్మన్ మామిడి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.