Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చులకనగా మాట్లాడితే మూల్యం చెల్లించక తప్పదు
- సీపీఐ నియోజక వర్గ సమావేశంలో సాబీర్‌పాషా హెచ్చరిక
నవతెలంగాణ-కొత్తగూడెం
విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట తీరు మార్చకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా హెచ్చరించారు. రేగా కాంతారావు వైఖరి ఏరు దాటి తెప్ప తగలేసేవిధంగా ఉంటుందని అదే దృష్టితో ఇప్పుడు కూడా చులకనగా మాట్లాడితే సహించబోమన్నారు. ఆదివారం స్థానిక శేషగిరి భవనంలో కొత్తగూడెం నియోజక వర్గ సిపిఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీసంశెట్టి పూర్ణచందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాష మాట్లాడుతూ రేగా కాంతారావు కమ్యూనిస్టులతో పొత్తు కుదిరిందని రాజ్యసభ, ఎంఎల్సీలు ఇచ్చేస్తే సరిపోతుందని చులకనగా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఎంఎల్సీల కోసమో, రాజ్యసభ పదవుల కోసమో లేక మార్కెట్ కమిటీల కోసమో బీఆర్ఎస్కు మద్దతునివ్వడం లేన్నారు. విశాల దృక్పథంతో బిజెపి ముప్పును గ్రహించి బిజెపిని కట్టడి చేసేందుకు మాత్రమే అంశాల వారీ మద్దతునిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాథం, గుత్తుల సత్యనారాయణ, వై. శ్రీనివాసరెడ్డి, వీరస్వామి, వెంకట్, శేషయ్య, కుమారి హన్మంతరావు, రత్నకుమారి, సంపూర్ణ, పద్మజ, రాము తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి విద్యుత్ స్తంభాలపై వేసిన కేబుల్స్ తొలగించాలి
నవతెలంగాణ-ఇల్లందు
ఈఅండ్ఎం ఆదేశానుసారం ఇల్లందు ఏరియాలో సింగరేణి సంస్థ ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇంటర్నెట్/కేబుల్ టీవీల కేబుల్స్ తొలగించాలని జీఎం ఆదేశించారు. కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఏరియా జీఎం యం.షాలెం రాజు మాట్లాడుతూ తరచూ జరుగుతున్న తనిఖీలలో భాగంగా ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ కే.వి ఇండిస్టియల్ ఫీడర్ పై (ఓఎఫ్సీ) కేబుల్ వేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ పనిని వర్క్ షాప్ సిబ్బంది అడ్డుకున్నారు, ఆ కేబుల్ బండిల్‌ను భద్రత సిబ్బందితో తొలగించి నిర్బంధించినట్టు తెలిపారు. అంతేకాకుండా కాలనీలో 33 కె.వి, 3.3 కె.వి స్తంభాలపై టీవీ నెట్వర్క్ కేబులు వేసినట్లు గుర్తించామన్నారు. 33 కె.వి, 3.3 కె.వి కరెంటు స్తంభాలు చాలా ప్రమాదకరమన్నారు.