Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
లెప్రసి (కుష్టు) వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ ఏనిక ప్రసాద్ అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధిలో గల కూనవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పర్శ లెప్రసీ అవగాహన ఉద్యమంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడారు. అనంతరం స్పర్శ లెప్రసీ మీద ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోటేశ్వరరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ లింగ్యానాయక్, సూపర్ వైజర్ బి.దయామనీ, రాంప్రసాద్, ఉమేష్, లక్ష్మి, చంద్రకుమారి, లక్ష్మి, వీరమాతా, సెక్రటరీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : మండలంలోని పలు గ్రామాలలో కుష్టు వ్యాధిపై అవగాహనా సదస్సులు సులానగర్ ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల వైద్య అధికారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బానోత్ సరోజ, స్థానిక సర్పంచ్ భూక్య ఇందిరా, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, దాసరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : జాతీయ కుష్ఠు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని యర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడారు.వ అదేవిధంగా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ మోహన్ రావు, వైద్య సిబ్బంది వెంకటేశ్వరావు, నాగేశ్వరావు, శారా రాణి, రాందాసు, పుష్ప తదితరులు పాల్గొన్నారు.