Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరిలో 10 వేల మందితో ఆత్మీయ సమ్మేళనం : రావులపల్లి
నవతెలంగాణ-మణుగూరు
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యమని పినపాక నియోజకవర్గ అధ్యక్షులు రావుపల్లి రామమూర్తి అన్నారు. సోమవారం పినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యవేదిక మణుగూరు కేంద్రంగా సోమవారం కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మొదటిగా పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన మాదిగ సోదరులందరూ జై భీమ్ నినాదాలతో నియోజకవర్గ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకొని మాదిగ ఐక్యవేదిక ప్రాంతీయ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా కుర్రి రాజేశ్వర్ రావు, ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ప్రముఖ జర్నలిస్టు మాచర్ల శ్రీనులు పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం మాదిగ ఐక్య వేదిక నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ నియోజకవర్గ మాదిగల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి మాదిగలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల కమిటీలు ఏర్పాటు చేసామని మని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో మాదిగ సమ్మేళనం ఏర్పాటు చేసి సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 7000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఇసంపల్లి కృష్ణ, ట్రెజరర్ నల్లగట్ల రఘు, మీడియా సెల్ ఇంచార్జ్ సిద్దెల తిరుమల రావు, సహాయ కార్యదర్శి పొడుతూరి విక్రమ్, గొల్లపల్లి నరేష్, లింగంపల్లి రమేష్, ఐటీసీ ఉద్యోగులు కేసుపాక నరసింహారావు, మిరియాల నరసింహారావు, ఇస్రం శ్రీను, రాజబాబు, అవులూరి రమేష్, లాయర్లు గద్దల సాంబ, అశోక్, మీడియా విభాగం తోకల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.