Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐడీఓసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి
నవతెలంగాణ-పాల్వంచ
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసారని, ఆ మహానీయుల పుణ్య ఫలంగా నేడు మనందరం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాలులో దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకనేందుకు ప్రతి ఏటా జనవరి 30న త్యాగధనుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : వాసవీక్లబ్ గ్రేటర్ దమ్మపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేట్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ వీఎన్ గోల్డెన్ స్టార్ కేసీజిఎఫ్ గంగిశెట్టి గంగాధర్, జగదీష్ కుమార్, ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ వీఎన్ గోల్డెన్ స్టార్ కేసిజిఎఫ్ రేగూరి హనుమంతరావు, ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వీఎన్ సిల్వర్ స్టార్ కేసీజియఫ్ పోలిశెట్టి శివకుమార్, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ వీఎన్ సిల్వర్ స్టార్ కేసీజిఎఫ్ దారా మల్లికార్జునరావు, వాసవి క్లబ్ అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పసుమర్తి రామ్ భద్రరావు, వీరేశ్వర రావు, గోపి పాల్గొన్నారు.
టీఎన్జీవో ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి
భద్రాచలం : టీఎన్జీవో భద్రాచలం ప్రెసిడెంట్ డెక్క నరసింహారావు, ట్రేజిరెర్ పడిగా నరసింహారావు ఆధ్వర్యంలో గాంధీజీ 75వ వర్ధంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. అసోసియేట్ ప్రెసిడెంట్ నాగభూషణం, టీఎన్జీవో ప్రెసిడెంట్ నరసరావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి భారతీయులకు స్వతంత్రం సాధించిన మహానీయులల్లో అగ్రగన్యుడు గాంధీజీ అని అతన్ని మహాత్ముడు, జాతి పితా పిలిచేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ, లింగమూర్తి, నాల్గవ తరగతి జిల్లా అధ్యక్షుడు భాషా, సత్యనారాయణ పాల్గొన్నారు.
కరకగూడెం : గాంధీ స్మారక నిధి మేనేజర్ నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 75వ వర్దతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : బాపూజీ ఆశయాల అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని వైసీపీ నాయకులు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం గాంధీ స్మారక నిధి మేనేజర్ నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 75 వర్ధంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
అశ్వారావుపేట : మహాత్మా గాంధీ వర్ధంతిని సోమవారం మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో కార్యాలయంలో, అశ్వారావుపేట పూర్వ ప్రధాన రహదారిలో గల గాంధీ కూడలిలో ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యాలయం ప్రాంగ ణంలో గల గాంధీ విగ్రహానికి, గాంధీ కూడలిలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ సీతారామరాజు, సూపర్ డెంట్ ప్రసాద్, ఎల్డీసీ శ్రీనివాస్, ఈసీ నరేష్, టైపిస్ట్ ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ రాజేశ్వరి, అటేండర్స్ చారి, కుమారి, పాషా, కాంగ్రెస్ నియోజక వర్గం నాయకులు చెన్నకేశ వరావు, వగ్గేల పూజ తదితరులు పాల్గొన్నారు.