Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో సమావేశ మందిరంలో అన్నిశాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోనే వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలను వినతులను స్వీకరించి పరిష్కార నిమిత్తం అధికారులకు ఆదేశించారు. పాల్వంచ మండలంలోని పాతపాల్వంచ గ్రామానికి చెందిన గడ్డం అజరుకుమార్ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు చేసినా నిధులు విడుదల చేయలేదని ఫిర్యాదు చేశారు. ఇల్లందు మండలం పాతపూసపల్లి గ్రామానికి చెందిన మూడిగ కృష్ణమూర్తి, కొందరు వంశపారంపర్యంగా 5 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నామని సర్వే నిర్వహించి తగు న్యాయం చేయాలని కోరారు. అలాగే పలు ఫిర్యాదులపై కలెక్టర్ అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.