Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాజమాన్యం ఉత్తర్వులు జారీ
- సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్‌గా ఎన్వికె.శ్రీనివాస్
- డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అధికారిగా వెంకటేశ్వర రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ ఇద్దరు డైరెక్టర్స్‌ను నియమించింది. సోమవారం సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. డైరెక్టర్ ఆపరేషన్‌గా ఎన్వికె.శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ అధికారిగా జి.వెంకటేశ్వర రెడ్డిలను నియమిస్తూ సింగరేణి యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా డైరెక్టర్లు లేక ఉన్న డైరెక్టర్స్‌కు ఇతర విభాగాల విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న డైరెక్టర్ ఆపరేషన్ (పా) చంద్రశేఖర్‌రావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపద్యంలో డైరెక్టర్ పా బాధ్యతలను సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.బలరామ్‌కు (పా) బాధ్యతలు అప్పగిస్తు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.