Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ వెల్లడి
- సీఎస్ డాక్టర్ శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-పాల్వంచ
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో ఉపాధ్యాయులు అభ్యంతరాలను తెలియజేయుటకు ఐడిఓసి కార్యాలయంలో ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం హైదరాబాదు నుండి సిఎస్ డాక్టర్ శాంతకుమారి ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు, కంటి వెలుగు, ఉద్యానవనాలు, పామ్ ఆయిల్ పంట సాగు తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల్లో ఉపాధ్యాయల నుండి అభ్యంతరాలు స్వీకరించుటకు జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, ఇద్దరు సీనియర్ జిల్లా అధికారులతో డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఉద్యాన పంటలు సాగు గురించి మాట్లాడుతూ జిల్లాలో 16580 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపటట్టాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు 11163 ఎకరాల్లో చేపట్టామని మిగిలిన 5697 ఎకరాలను ఫిబ్రవరి మాసంలో పూర్తి చేస్తామని తెలిపారు. పామాయిల్ మొక్కల కొరతలేదని ఇప్పటి వరకు 1450 మంది రైతులు డీడీలు చెల్లించి సిద్ధంగా ఉన్నారని, వారందరికీ పామాయిల్ మొక్కలు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ బాగా జరుగుతుందని, ఇదే స్ఫూర్తితో కొనసాగించి కంటి సమస్యలున్న ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందచేయాలని సచించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలు ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.