Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతువుల పట్ల కరుణతో వ్యవహరించాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రతీ భారత పౌరుడు పర్యావరణ పరిరక్షణ చట్టం, వణ్యప్రాణి సంరక్షణ చట్టం, జంతు హింస నివారణ చట్టం తప్పక పాటించాలని లేని పక్షంలో శిక్షార్హులు అవుతారని కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సముదాయంలో జంతు సంక్షేమ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ జంతువులను, పక్షులను, నీటిలో బతికే జీవిలకు హాని కలింగించరాదని అన్నారు. వాటి ఆవాసాలను నాశనం చేయరాదని చెప్పారు. పక్షులు నివాసమున్న వృక్షాలను నరకరాదని సూచించారు. జంతు సంరక్షణకు భారత ప్రభుత్వం అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను స్థాపించిందని రాష్ట్రంలో రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు జిల్లాలో కలెక్టర్ అధ్యక్షులుగా సంబంధిత శాఖ అధికారులు జంతు సంక్షేమ స్వచ్చంధ సంస్థల ప్రజా ప్రతినిధులు సభ్యులుగా జిల్లా జంతు హింస నివారణ సంఘాలను స్థాపించడం జరిగిందని అన్నారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలను వేయించాలని ఎట్టి పరిస్థితులలో నిర్ధాక్షిణ్యంగా బయటకు వదలరాదని అన్నారు. పశువులను రవాణా చేసేటప్పుడు నిబంధనలను పాటించాలని లేని ఎడల శిక్షార్హులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యశాఖాధికారి డా.ఇక్టర్ బి.పురందర్, పిడివి ఆంజనేయ శర్మ, ప్రసాదరావు, జెవిఎస్ చంద్రశేఖర్, ఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.