Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు సీఐటీయూ విజ్ఞప్తి
నవతెలంగాణ-పాల్వంచ
ఫిబ్రవరి మూడవ తారీకు నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడాలని, బడ్జెట్లో ఐసీడీఎస్‌కు నిధులు కేటా యించాలా కృషి చేయాలని, కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావుకి సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, కే.సత్యలు మాట్లాడుతూ... అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మంది ఉద్యోగులు 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని, వీరికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం, పెన్షన్, గ్రాడ్యుటి, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం లేకుండా, ఎర్టిగా పనిచేస్తున్నారని వారు తెలియజేశారు. అలాగే ఐసీడీఎస్‌కి బడ్జెట్లో నిధులు కేటాయించి వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని, ఫీడింగు సెంటర్లకు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బిఎల్ఓ డ్యూటీల వల్ల అంగన్వాడీలో ఫీడింగ్ పోష్టికాహారం అందించడం ప్రీస్కూల్ యాక్టివిటీస్ నిర్వహించడం ఇవన్నీ పక్కదారి పడుతున్నాయని, దీనికి ఆటంకంగా ఉన్న బిఎల్ఓ డ్యూటీలో నుండి అంగన్వాడీలను మినహాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రహీం, అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకులు, మాధవి, శారద, అచ్చమ్మ, నాగమణి, ధనలక్ష్మి, రమ్య, పద్మ, శైలజ రాజకుమారి, నిర్మల, జ్యోతి, రజిని, జరీనా, భవాని తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : అంగన్వాడీ టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యు చట్టాన్ని అమలు చేయాలని టీచర్‌కు ఆరు లక్షలు హెల్పర్‌కు నాలుగు లక్షలు తగ్గకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి డిమాండ్ చేశారు. అంగన్ వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే పొదెంవీరయ్యకు సీఐటీయూ వినతిపత్రం అందజేసింది. అంగన్వాడీ టీచర్లు సీఐటీయూ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో చేరుకొని అంగన్వాడి టీచర్లు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో భాగ్యలక్ష్మి పథకం కింద అందిస్తున్న భోజనానికి తల్లులకు మెనూ ఛార్జి రోజుకు రూ.పదికి పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకి అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడికి టీచర్లకు హెల్పర్లకు ఇవ్వాల్సిన మూడు నెలల పెండింగ్ ఏరియాస్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు.
సీడీఎస్ పరిరక్షణ కోసం ఏప్రిల్ 5న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 1,2,3 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని ఈ లోగా ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్ళు అనురాధ, లలిత, సావిత్రి, తిరుపతమ్మ, జ్యోతి, విజయలక్ష్మి, విజయ, జ్యోతినిర్మల తదితరులు పాల్గొన్నారు.