Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్షిక బొగ్గు ఉత్పిత్తి లక్ష్యంగా పనిచేయాలి
- విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ (పా) చంద్రశేఖర్‌రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి యాజమాన్యం కార్మికులకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలుతోనే సింగరేణి సంస్థ అభివృద్ధి సాధ్యం అవుతుందని, కార్మికులు, ఉద్యోగుల కృషితో సంస్థ నిర్ధేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం అధిగ మించాలని, సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన సింగరేణి సంస్థ వార్షికంగా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చుచేస్తున్న నిధుల వివరాలు, సంస్థలో ఉద్యోగాల నియామకాల, మనుగడకు నూతన బావులు, బొగ్గు ఉత్పత్తి గురించి, నూతనంగా సోలార్ విద్యుత్‌లో సాధిస్తున్న ప్రగతి వివరించారు. సింగరేణి తన ఉద్యోగులకు పూర్తి మద్దతును అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. సంక్షేమ చర్యలను అందించడంలో 2021-22లో రూ.356 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేసిందని చెప్పారు. 31డిసెంబర్ 2023 వరకు కారుణ్య నియామక ఉపాధిని 14801 అందించామని చెప్పారు. 2021-22 లో ప్రతి ఉద్యోగి కోసం చేసిన సంక్షేమ వ్యయం సింగరేని సంస్థ రూ.3,11,992. ఖర్చు చేసిందన్నారు. సంస్థ క్రీడాకారులు ఇటీవల కోల్ ఇండియా స్థాయిలో నిర్వహించి క్రీడా పోటీల్లో 18 బంగారు పతకాలు, అనేక ఇతర పతకాలను కైవసం చేసుకున్నారని వివరించారు. ఉద్యోగుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కొత్త క్వార్టర్స్‌ను నిర్మించాలని యోచిస్తున్నామని చెప్పారు. మొత్తం 88 ఎంఏ రకం, 96 ఎంసీ రకం, 42 ఎండి రకం క్వాటర్స్ నిర్మించేందుకు ప్రణాళిక చేయడం జరిగిందని వివరించారు.ఈ విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారాయణ, జిఎంలు బసవయ్య, అందెల ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.