Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీల స్థాయి ప్రజాచైతన్య సదస్సుల్లో కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకు నేందుకు ప్రతిఒక్కరూ తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, అప్పుడే నాటి మహానీయుల ఆశయాలను నెరవేర్చిన వారమవుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలోని అశోకనగర్ కాలనీ, ఎదురుగడ్డ గ్రామ పంచాయతీల స్థాయి ప్రజాచైతన్య సదస్సులు ఆయా పంచాయతీ కేంద్రాల్లో సోమవారం జరిగాయి. ఈ సదస్సులలో కూనంనేని మాట్లాడుతూ బిజెపి, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థలు ప్రజలమధ్య మతంపేరుతో విద్వేశాలు రెచ్చగొట్టి పబ్బంగడుపుకునే కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి మతోన్మాద శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీపీఐ మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులలో జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కె.తర్నకుమారి, ఎం.ధనలక్ష్మి, నాయకులు నూనావత్ గోవిందు, జర్పుల మురళి, నున్నా ధనుంజర్రావు, పోశం, సాధిక్, చలమల సత్యం, మహేష్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.