Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ సిహెచ్ శ్రీనివాసరావు
నవతెలంగాణ-అశ్వాపురం
ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం పోలీస్ శాఖ విశిష్టమైన కృషి చేస్తుందని అశ్వాపురం సీఐ సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండలంలోని జి కొత్తూరు గ్రామపంచాయతీ గుండ్లమడుగు గ్రామంలో సివిక్ యాక్షన్ కార్యక్రమాన్ని 141 బెటాలియన్ ఎఫ్ కంపెనీ, జి కంపెనీ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల సంచారం పోలీస్ శాఖకు అందజేయాలన్నారు. ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. అనంతరం జి కొత్తూరు, గుండ్లమడుగు ఏలకలగూడెం, గొందిగూడెం గ్రామ ప్రజలకు దోమతెరలు, సోలార్ లైట్లు, టీ షర్ట్స్, చీరలు, దుప్పట్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూరిబాబు, కమాండెడ్ ప్రశాంత్ దార్, సెకండ్ కమాండర్ లతీఫ్ కుమార్ సాహౌ, కమల్ వీర్ యాదవ్, అసిస్టెంట్ కమాండర్ హేమంత్ కుమార్ శర్మ, రాజ్ కుమార్ అశ్వాపురం ఎస్సై నాగుల్ మీరా, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, సాగర్ మల్లు, గొందిగూడెం ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.