Authorization
Thu April 10, 2025 12:29:08 am
నవతెలంగాణ-అశ్వాపురం
మండలంలోని కల్యాణపురం, మిట్టగూడెం, బట్టిలగుంపు, రాంనగర్, పీచులక తండా, అమ్మగారిపల్లి, అనుశక్తి నగర్, అశ్వాపురం (సెక్యూరిటీ), అమెర్థ గ్రామాలలో గల వాలీబాల్ క్రీడాకారులకు మంగళవారం రేగా కాంతారావు ఆదేశాల మేరకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోడి అమరేందర్ చేతులమీదుగా వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన శారీరిక ధృఢత్వం మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, చిలక వెంకటరమయ్య, చుంచ్చు రామ్మూర్తి, నేలపట్ల సత్యనారాయణ రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, దుర్గారావు, కనీష్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.