Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాల్వంచలోని పాత పాల్వంచకు చెందిన భక్తుల మధు చందును నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక ఉత్తర్వులను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమికమైన మధు చెందు మాట్లాడుతూ వివిధ సామాజిక యువజన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నన్ను ప్రోత్సహించి బీసీ యువజన సంఘంలో పనిచేసే బీసీలకు సేవ చేయాలని ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్, జిల్లా అధ్యక్షులు రెడ్డిమల వెంకటేశ్వర్లు ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేకతలు తెలియజేశారు. ఈ పదవి వచ్చినందుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, నిర్మిశెట్టి ముత్తయ్య, కొత్వాల సత్యం హర్షం వ్యక్తం చేశారు.