Authorization
Wed April 09, 2025 04:32:50 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు అబ్జల్ బేగం జాతీయ స్థాయి శటిల్ బాడ్మింటన్ క్రీడల్లో రాణిస్తున్నారు. జనవరి 31 మంగళవారం నుండి ఫిబ్రవరి 6 సోమవారం వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల సచివాలయం జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ సెటిల్ బాడ్మింటన్ టోర్నమెంట్లో ఆమె పాల్గొంటున్నారు. మొదటి రోజు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రారు పూర్ సెటిల్ బాడ్మింటన్ పై విజయం సాధించారు. రెండో మ్యాచ్‌లో చండీఘర్‌లో సింగిల్ విభాగంలో గెలుపొందారు. ఈ విజయం ద్వారా అబ్జల్ బేగం తెలంగాణా రాష్ట్రం తరఫున ఆమె జాతీయ క్రీడల్లో రాణిస్తుండంతో అశ్వారావుపేట ఏఓ నవీన్ కుమార్, ఏఈఓలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేసారు.