Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీశాట్ ప్రోగ్రాంలో పాఠాలు బోధన
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం గిరిజన గురుకుల బాలికలు... టీచర్స్‌గా అవతారమిత్తారు...! స్వయం పాలన దినోత్సవంలో కాదు సుమా....! హైదరాబాద్ టీశాట్ ప్రోగ్రాంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా...! ఈ అపురూప సన్నివేశం మంగళవారం చోటు చేసుకుంది...! తమ పిల్లలు టీవీలల్లో... పాఠాలు బోధిస్తుంటే... ఆ సన్నివేశం టీవీలలో వీక్షిస్తున్న తల్లిదండ్రుల హదయాలు ఉప్పొంగగా, వారిని తీర్చిదిద్దుతున్న గురువులు ఆనందభరితులయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక బి.దీక్షిత, ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న డి.సౌమ్యలు మంగళవారం హైదరాబాద్ టీశాట్ ప్రోగ్రాంలో సూపర్ స్టూడెంట్ శీర్షికలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ బోధన చేశారు. దీక్షిత ఫిజిక్స్ సబ్జెక్టులో సహజ ఇంద్రధనస్సు నిర్మాణం, కాంతి వ్యాప్తి, సౌమ్య బోటనీ సబ్జెక్టులో పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి అంశాలపై ఇంగ్లీషులో బోధించిన తీరు ఔరా అనిపించింది. ఈ ఇరువురి విద్యార్థులు ఉభయ ఖమ్మం జిల్లా రీజియన్ స్థాయిలో సెలెక్ట్ అయి సూపర్ స్టూడెంట్‌కు అర్హత సాధించారు. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ పోట్రూ, భద్రాచలం ఐటిడిఏ ఏపీవో జనరల్, ఆర్‌సిఓ డేవిడ్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసును, పిల్లలకు తర్ఫీద్ ఇచ్చిన టీచర్స్, లెక్చరర్స్‌ను కూడా ఎంతగానో మెచ్చుకున్నారు.