Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
కంటి వెలుగు ద్వారా వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ కళ్ళ పరీక్షను నిర్వహించడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదప డుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి వ్యక్తికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి చూపు మందగించడం జరుగుతుందని తెలిపారు. మాధుర్యాలను, దృశ్యాలను చూసి సంతోషపడేం దుకు జ్ఞానేంద్రియమైన కళ్ళు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. కంటి పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన వైద్య పరికరాలు, మందులను అందుబాటులోకి ఉంచారు. కంటి పరీక్షలు చేసిన తర్వాత అదే వైద్య శిబిరంలో రీడింగ్ గ్లాసులను పంపిణీ చేశారు. న్యాయ మూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. న్యాయ మూర్తులు సీనియర్ సివిల్ జడ్జి ఏ. నీరజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రామారావు, భార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుబ్రోలు రాంప్రసాదరావు డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ జెవిఎల్.శిరీష, న్యాయవాదులు ఏ.జీపి.బాబు రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణమూర్తి, లక్కినేని సత్యనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.