Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
సీసీ రోడ్డు పనులకు మండలంలోని దంతేలబోర ఎస్సీ కాలనీ సర్పంచ్ గద్దల రమేష్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న మా గ్రామపంచాయతీకి కలెక్టర్ స్పందించి ప్రత్యేక నిధులనుంచి నిధులు మంజూరు చేసినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామపంచాయతీకి కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి మంజూరైన సీసీ రోడ్డు పనులను ప్రారంభించమని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సిసి రోడ్ లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు విన్నవించగా గ్రామ సమస్యను స్పందించి వెంటనే ప్రత్యేక నిధులను ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అచ్చు, వీఆర్ఏ శ్రీను, జేతియా, ఉపసర్పంచ్ వెంకట నరసమ్మ, కో ఆప్షన్ సభ్యులు చిన్న ముత్యం, శ్రీను, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.