Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓసి ప్రాజెక్టుల ద్వారా నిర్ధేశించిన లక్ష్యం
- మే చివరి నాటికి వికే ఓసీ పనులు ప్రారంభం
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియా జనవరి మాసంలో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించి 101 శాతం నమోదు చేసిందని, ఓపెన్ ప్రాజెక్టుల ద్వారా నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధ్యం అవుతుందని, 2023 మే చివరి నాటికి కొత్తగూడెం ఏరియాలో వికే ఓసీ పనులు ప్రారంభం చేయనున్నట్లు కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేష్ తెలిపారు. మంగళవారం ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి నెల కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడినది 13.71 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 13.78 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 101 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని చెప్పారు. సత్తుపల్లి జేవిఆర్‌ఓసిపికి నిర్ధారించిన జనవరి లక్ష్యాన్ని అధిగమించి 127శాతంతో 11.91 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం అభినందనీయమన్నారు. కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జనవరి వరకు 113.13 లక్షల టన్నులకు గాను 101.51 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 90శాతం ఉత్పత్తి సాదించామన్నారు. ఉత్పత్తిచేసిన బొగ్గును సమయానికి వినియోగ దారులకు చేర్చడంలో ఏరియా నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. రోడ్డు, రైల్ ద్వారా జనవరి నెల కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడినది 13.71 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 14.78 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 108 శాతం రవాణ చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జనవరి వరకు 113.13 లక్షల టన్నులకు గాను 107.34 లక్షల టన్నులు బొగ్గు రవాణా జరిగిందని చెప్పారు. జనవరి20న అత్యధికంగా 13 రైలు రేకులు రవాణా చేయడం జరిగిందన్నారు. కొత్తగూడెం చరిత్రలోనే జనవరి నెలలో 322 రేకులు రవాణా చేసి అంతకు ముందు నెలకొల్పిన 300 రేకులు (డిసెంబర్ -2022) రికార్డును బ్రద్దలు చేయడం జరిగిందన్నారు. కార్మికు సంక్షేమం కోసం ఏరియాలో నూతన గృహాన నిర్మాణం చేపట్టి నట్లు తెలిపారు. జయశంకర్ మైదానం సమీపంలో కార్మికులకు నూతన గృహ సముదాయాన్ని ఏర్పాటు చేస్తునామని చెప్పారు. ఈ నెల 15న కొత్తగూడెం ఏరియా నూతన జిఎం కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయాన్ని తెలిపారు. సత్తుపల్లి ఏరియాలో నూతన జిఎం నూతన కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటుతో సింగరేణికి అధిక మేలు జరుగుతుందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏరియా ఎస్‌ఓటు జిఎం ఆర్.నారాయణ రావు, ఏజెంట్ బూర రవీందర్, ఏజిఎం (సివిల్) సూర్యనారాయణ, డి.జి.ఎం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్, డిజిఎం.(ఎఫ్ అండ్ ఏ) రాజశేఖర్, డిజిఎం (ఐఈ) యోహాన్, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణా రెడ్డి, సీనియర్ పిఓ.లు మజ్జి మురళి,జి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.