Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెల్లించిన వారికి మరోసారి నోటీసులు
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలో ట్రేడ్ లైసెన్స్ పేరుతో మున్సిపల్ సిబ్బంది అడ్డగోలుగా చేస్తున్న వసూలు సరైంది కాదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. మంగళవారం పట్టణంలో పలు వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల కాలంలో, గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారస్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ ట్రేడ్ లైసెన్స్ పేరుతో నోటీసులు ఇస్తున్నారన్నారు. గతంలో చిన్న షాపులకు రూ.600లు, పెద్ద షాపులకు రూ.1,200లు వసూలు చేసేవారన్నారు. కానీ ఇప్పుడు రూ.3000 పైగా కట్టాలని అందులో ప్రతీ షాప్‌కు హరితనిధి క్రింద సంవత్సరానికి రూ.100లు చెల్లించాలని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గతంలో కట్టిన వారికి కూడా ట్రేడ్ లైసెన్స్‌లు కట్టలేదని నోటీసులు జారీ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, చెనిగారపు నిరంజన్ కుమార్, అల్లకొండ శరత్, కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, పత్తి మహేష్, ధనుంజయ్ పాల్గొన్నారు.