Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీతి అయోగ్ మిషన్ డైరెక్టర్‌ను కోరిన కలెక్టర్
నవతెలంగాణ-పాల్వంచ
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదించిన నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ అనిదీప్ తెలిపారు. మంగళవారం ఢిల్లీ నుండి నీతి అయోగ్ మిషన్ డైరెక్టర్ రాకేష్ రంజన్ ఆకాంక్షిత జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ అనుదీప్ పాల్గొని, మాట్లాడారు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి మౌలిక వనరుల కల్పనకు ఆరు కోట్లతో ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. గర్భిణీలు, చిన్నారుల్లో రక్తహీనతను అధిగమించేందుకు ఎంపిక చేసిన 1000 అంగన్వాడీ కేంద్రాలకు చిరుధాన్యాలు సరఫరా చేస్తున్న లక్ష్మీ గణపతి జాయింట్ లయబులిటీ గ్రూపునకు కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా ప్రణాళిక అధికారి మిల్లెట్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ అస్పిరేషనల్ పోగ్రామ్ లీడర్‌తో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మిల్లెట్ ఫుడ్ ఇంపాక్ట్ స్టడీ ఏర్పాటు చేయాలని, చిరుధాన్యాలు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మోహన్‌ను ఆదేశించారు. నీతి అయోగ్ మంజూరు చేసిన నిధులు నేరుగా ఏజెన్సీలకు చెల్లింపులు చేసేందుకు సంబంధిత ఏజెన్సీలను మ్యాఫింగ్ చేయాలని, ఆస్పిరేషన్ జిల్లా ప్రోగ్రాం లీడర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, చిరుధాన్యాల ప్రాజెక్టు ఆర్డినేటర్ మోహన్, ఆస్పిరేషన్ జిల్లా ప్రోగ్రాం లీడర్ పియూస్ పాల్గొన్నారు.