Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద ఎత్తున సాగుకు చర్యలు చేపట్టాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ఆయిల్ ఫామ్ పంటలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రైతులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున సాగు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్‌లో ఆయిల్ ఫామ్ పంట సాగుపై ఉద్యాన వ్యవసాయ ఆయిల్ ఫామ్ బిందు సేద్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 16860 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు నాటాలని లక్ష్యం కేటాయించగా ఇప్పటివరకు 12 వేల ఎకరాల్లో నాటారని మిగిలిన 4860 ఎకరాల్లో మొక్కలు నాటే ప్రక్రియను మార్చి 15వ తేదీ వరకు పూర్తి చేయాలని చెప్పారు. ఆయిల్ దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున సాగు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మండలాల వారిగా కేటాయించిన లక్ష్యాలను వ్యవసాయ అధికారులను ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన పంట రైతులకు లాభదాయకమని పంట రైతులకు లాభదాయకమని కేటాయించిన లక్ష్యాన్ని కంటే అధికంగా మొక్కలు నాటాలన్నారు. ఇది మంచి సీజన్ అని ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి మొక్కలు పంపిణీ చేయాలని ఆదేశించారు. పామాయిల్ పంట సాగును ప్రోత్సహించడంలో భాగంగా ఉద్యాన వ్యవసాయ అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. మొక్కలు నాటింది లేనిది ఉద్యాన వ్యవసాయ అధికారులు తనిఖీ చేసి నివేదికలు అందజేయాలని చెప్పారు. బిందు సేద్యం చేయాలని, బిందు సేద్యం వల్ల నీటి వినియోగం చాలా తక్కువగా ఉండడంతో పాటు మొక్కలు కావలసిన నీరు లభిస్తుందని చెప్పారు. బిందు సేద్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల నీరు ఎక్కువగా వినియోగించాల్సి వస్తుందని దాని ద్వారా భూగర్భ జలాలు తగ్గిపోయి అవకాశం ఉన్నట్లు చెప్పారు. బిందు సేద్యం ఏర్పాటును జైన్ కొఠారి, నెటఫిమ్ పినలెగ్స్ జిల్లా కోఆర్డినేటర్లు అడిగి తెలుసుకున్న కలెక్టర్ లక్ష్యసాధనలో వెనుకంజులో ఉన్న జిల్లా కోఆర్డినేటర్లకు సోకజ్ నోటీలు జారీ చేయాలని ఉద్యాన అధికారిని సూచించారు.
రానున్న రెండు నెలల్లో నిర్దేశించిన లక్ష్యం మేరా డ్రీప్ ఏర్పాటు చేయాలని జాప్యం చేస్తే భవిష్యత్తులో డ్రీప్ పనులు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రిప్ ఏర్పాటు వల్ల నీటి ఆదా అవుతుందని మొక్కలకు పుష్పలంగా కావాల్సినంత నీరు అందుతుందని వంటల్లో సమతుల్యత ఉండి ఉత్పత్తి అధికంగా వస్తుందని చెప్పారు. తక్షణమే ఏర్పాటు చేయాలని కోఆర్డినేటర్లకు ఆదేశించారు. నర్సరీ మొక్కలు పెంపకాన్ని తనిఖీ చేసి నివేదికలు అందజేయాలని ఉద్యాన వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన వ్యవసాయ అధికారులు, ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి బాలకృష్ణ, గోద్రెజ్ మేనేజర్ రామకృష్ణ, జైన్ కొఠారి నెట్ ఫిమ్ ఫినోలెక్స్ జిల్లా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.