Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బీరవల్లి రఘు జన్మదిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా ఏర్పాటు చేసిన కేకును నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది సమక్షంలో కట్ చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి కట్ట అజరు కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ ఇస్మాయిల్, పలు గ్రామాల సర్పంచులు టిఆర్‌ఎస్ నాయకులు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అదేవిధంగా పోచారం సొసైటీలో ఏర్పాటు చేసిన కేకును కూడా ఎంపీపీ బీరవల్లి రఘు కట్ చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి కట్ట అజరు కుమార్, పోచారం సొసైటీ అధ్యక్షులు నర్వనేని పెద్ద అంజయ్య, సీఈవో అంజయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.