Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక
- సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన
- కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం విమర్శించింది. బుధవారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీకి రూ.29వేల కోట్లు తగ్గించడానికి నిరసనగా, కార్పోరేట్‌లకు భారీ రాయితీలు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ, ఆహార సబ్సిడీ, రైతులకు ఇచ్చే ఇన్‌ఫుట్ సబ్సిడీల పైన భారీ ఎత్తున కోత విధించడం గ్రామీణ ప్రాంత పేదల నోట్లో మట్టి కొట్టిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అభిప్రాయపడుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని పిలుపులో భాగంగా స్థానిక బస్టాండ్ సెంటర్‌లో మోడీ ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, నాయకులు బాలకృష్ణ, ప్రేమ్ కుమార్, సిద్దెల రాములు, ఈసం రాంబాబు, రమ, వీరమ్మ, రఘు, శివ, రాజు, సమ్మక్క, భారతి, రామకోటమ్మ, జానకి దేవి, తదితరులు పాల్గొన్నారు.