Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీఏ మాస్టర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఏరియా స్టోర్ గ్రౌండ్‌లో టిడిఏ మాస్టర్ కప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. క్రీడాకారులకు ఉద్యోగ ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నర్సింహారావు, ఎక్స్‌లెంట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ యూసఫ్ షరీఫ్, బుద్దరాజు నరసింహారాజు (నవీన్‌బాబు), కార్యకర్తలు, అధిక సంఖ్యలో క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా కందిమల్ల
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా సీనియర్ న్యాయవాది కందిమల్ల నరసింహారావు ఎంపికయ్యారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావును నరసింహరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు,అడపా అప్పారావు, తదితరులు, పాల్గొన్నారు.
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో అశ్వాపురం మండలం ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మైనార్టీల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.