Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
మండలంలోని క్రీడాకారులకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లను బుధవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, ఎంపీపీ రేగా కాళికా చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ, శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పినపాక మండల కోపరేటివ్ డైరెక్టర్ రావుల కనకయ్య, స్థానిక సర్పంచ్ ఊకే రామనాథం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, కొంపెల్లి పెద్ద రామలింగం, బైరిశెట్టి చిరంజీవి, కొలగాని పాపారావు, ఉప సర్పంచ్ రావుల రవి,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.