Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పోడు సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాలు జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు బుధవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో పోడు పట్టాల జారీ చేసేందుకు రెవెన్యూ అటవీ కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో పోడు సాగుదారుల పట్టాలు మంజూరుకు 332 గ్రామ పంచాయతీల పరిధిలో 726 హ్యాబిటేషన్లు నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. దరఖాస్తులు చేసిన వారిలో ఎస్టీలు 65616 మంది గిరిజనేతరులు 17725 మంది ఉన్నారని తెలిపారు. పోడు భూములకు పట్టాలు జారీ చేయాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలు ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం ఇచ్చిన క్లెయిమ్స్ ఆధారంగా ప్రతి హ్యాబిటేషన్‌లో క్షేత్రస్థాయిలో కమిటీలు సర్వే విచారణ నిర్వహించినట్లు చెప్పారు. సర్వే విచారణ అనంతరం కమిటీలు గ్రామసభలు నిర్వహించి ప్రజల సమక్షంలో తీర్మానాలు చేసినట్లు చెప్పారు. గ్రామసభల్లో చేసిన తీర్మానాలను డివిజన్ స్థాయి కమిటీకి సిఫార్ చేసినట్లు చెప్పారు. డివిజన్ స్థాయి గ్రామసభల డివిజన్ స్థాయి కమిటీల పరిశీలించిన సిఫార్సుల మేరకు జిల్లాస్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశంలో చర్చించినట్లు అని చెప్పారు.
కమిటీ సమావేశంలో చర్చించిన విధంగా పరిధిలోని హ్యాబీటేషన్ నుండి 11532 క్లైమేంస్‌కు 30684.29 ఎకరాలకు పోడుపట్టాలు జారీ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీల్లో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి విడత విచారణ పూర్తయిన క్లెయిమ్స్ ఆధారంగా అర్హుల ఎంపిక జరుగుతుందని తదుపరి కమిటీ సమావేశంలో వచ్చిన క్లెమ్స్ ఆధారంగా విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమిటీ సమావేశంలో సభ్యులు చేసిన అభ్యంతరాలను నమోదు చేస్తామని తిరిగి విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు జారీ చేస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావు లేదని నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు.