Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన జీఎంగా బాధ్యతలు చేపట్టిన రాంచందర్
నవతెలంగాణ-మణుగూరు
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్దికి పాటుపడాలని ఏరియా నూతన జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ అన్నారు. బుధవారం జనరల్ మేనేజర్‌ల బదిలీల ప్రక్రియలో భాగంగా మణుగూరు నూతన జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యావత్ సింగరేణిలో బొగ్గు, ఉత్పత్తి, రవాణా మణుగూరు ఏరియాకు ఎంతో గుర్తింపు, ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇలా ప్రత్యేక స్థానం కలిగిన మణుగూరు ఏరియాకు వచ్చి జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించడం, మణుగూరు ఏరియా సింగరేణియుల కుటుంబ సభ్యుల్లో నేను ఒకడిగా స్థానం పొందడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. మీ అందరి తోడ్పాటుతో, కార్మిక సంఘాల నాయకుల సహకారంతో శ్రమశక్తి, యాంత్రిక శక్తిని పూర్తిగా వినియోగించుకుంటూ బొగ్గు అధికోత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్న మణుగూరు ఏరియా ఆనవాయితీని మునుముందు కూడా కొనసాగించడమే కాకుండా రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గును వార్షిక లక్ష్యాలను అధిగమించేలా సాధించేందుకు నా వంతు కృషి తప్పక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ఎస్‌ఓటు జిఎ డి.లలిత్ కుమార్, ఏజిఎం జి నాగేశ్వర రావు, వెంకటేశ్వర్లు, నర్సి రెడ్డి, వెంకట రమణ, టి లక్ష్మీపతి గౌడ్, శ్రీనివాసచారి, వెంకట్ రావు, ఎస్ రమేశ్, డిజిఎం సురేశ్, శ్రీనివాస మూర్తి, వెంగళ రావు, సిహెచ్.శ్రీనివాస్, ఫినాన్స్ మేనేజర్ అనురాధ, పర్యావరణ అధికారి జె శ్రీనీవాసరావు పాల్గొన్నారు.