Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా భవన నిర్మాణ కార్మికులకు, మోటార్ సైకిల్స్ వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను కార్మికులకు సంక్షేమ కోసం ఖర్చు చేయాలని సిఐటియూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. పోస్ట్ ఆఫీస్, గణేష్ టెంపుల్ అడ్డాల వద్ద భవన నిర్మాణ కార్మికుల్లో కరపత్రాలు పంచుతూ మాట్లాడారు. అనంతరం చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్మికులు ఓర్సు శ్రీను, లింగయ్య, లక్ష్మణ్, సురేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.