Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం లోకసభలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని, గత కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తున్న కొవ్వూరు రైల్వే లైన్ విషయంలో ఈ బడ్జెట్‌లో కూడా కేటాయింపులు జరగలేదని విమర్శించారు. బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. ఈ బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న గిరిజన యూనివర్సిటీకీ కేటాయించిన నిధులు తూతుమంత్రంగానే ఉన్నాయని, బయ్యారం ఉక్కు గనుల ప్రస్తావన ఎక్కాడా లేదని విమర్శించారు. ఎక్కడ కూడా విభజన చట్టం హామీల ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. యూరియాకు ముప్పై వేల కోట్లు తగ్గించడం వల్ల వ్యవసాయ రంగం కుదేలు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి 13వేల కోట్లను తగ్గించారు. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.