Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్ పై కె.బ్రహ్మాచారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ- భద్రాచలం
ఆర్థిక అసమానతలు పెంచే విధంగా ఉన్న కేంద్ర బడ్జెట్ ఉందని, కనీస వేతనాల ఊసేత్తని ఆర్థిక మంత్రి అని, దేశంలో 23 కోట్ల మంది నెల వేతనం 10వేల లోపే ధరల నియంత్రణకు చర్యలు శూన్యం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి ఆరోపించారు. నిరుద్యోగం అదుపుకు ఉద్యోగాలు కల్పనకు ప్రణాళిక లేని బడ్జెట్ అని, దేశ సంపదలో 60 శాతం సంపద 100 మంది సంపన్నులు వద్ద కేంద్రీకృతమైందన్నారు. ఆర్థిక అసమానతల గురించి ప్రస్తావించని బడ్జెట్ అని, కార్పొరేట్లకు మేలు కలిగించే బడ్జెట్, కార్పోరేట్లపైన సూపర్ రిచ్ సంపన్నుల పైన పన్నులు వేయని కేంద్ర ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యులపై పెరుగు తున్న ధరల భారం అని,ప్రజల కొనుగోలు శక్తిని, ప్రజల ఆదాయాన్ని పెంచటానికి దోహదపడని బడ్జెట్ అన్నారు. కార్మిక హక్కులు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత గురించి, ఖాళీపోస్టుల భర్తీ గురించి మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణ, పట్టణ ఉపాధి హామీ పథకం కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజా అనుకూల బడ్జెట్ గా లేదు, కార్మికులు, రైతులు సామాన్య ప్రజానీకం ఆశలపై నీళ్లు చల్లారని, కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగం పరిరక్షణ కోసం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కనీస వేతనాల సాధన కోసం పోరాటాలు చేయాలని, సూపర్ రిచ్ సంపన్నులపై పన్నులు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.