Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆట, పాట, విద్యలో కార్పోరేట్‌ను దాటేశాం
- ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలు పెంచాలి
- తొలి దశ మన ఊరు మనబడి పాఠశాలల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-ఇల్లందు
విద్యార్థులందరికీ 12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వం పాఠశాలలు ఏర్పాటు చేసిందని ఆట పాట విద్యలో కార్పోరేట్‌ను దాటేశామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. పట్టణంలోని 20వ వార్డు స్టేషన్ బస్తీలో రూ. 62లక్షలతో నిర్మించిన ఉర్దూ, మండల పరిషత్ పాఠశాలలను బుధవారం ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మన ఊరు మనబడిబ్రోచరు, వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం డిఇవో అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. జిల్లాలో 368 తొలి దశ కింద పాఠశాలను మంజూరయ్యాయన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల్లో పండగ వాతావరణం నెలకొంది అన్నారు. చక్కటి తరగతి గదులు, మంచి ఫర్నిచర్, కిచెన్ షర్ట్స్, పరిసరమైన తాగునీరు తదితర 12 రకాల సౌకరాలతో ఉందన్నారు. మంచి అహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలలు ఉన్నాయన్నారు. ఆట పాటలతో ధీటుగా కార్పొరేట్‌ను దాటేశామన్నారు. అడ్మిషన్లకు డిమాండ్ వస్తది అన్నారు. ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలపై దృష్టి పెట్టాలన్నారు. చదవడం, రాయడం, లెక్కలు ఇతరములు చక్కగా బోధించాల్సిన బాధ్యతవారిదే అన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. డీఈవో, ఆర్అండ్బీ, మున్సిపాలిటీ డీఇలు వెంకటేశ్వరరావు, రచ్చ రామకృష్ణ కాంట్రాక్టర్ శ్రీనివాసరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దిండిగాల రాజేందర్, కౌన్సిలర్లు మెగిలి లక్ష్మి, కొండపల్లి సరిత, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, తహసీల్దార్ కృష్ణవేణి, డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పాఠశాలలను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. స్టేషన్ బస్తీలో బుధవారం ఉర్దూ మండల పరిషత్ పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యాసంస్థల రూపురేఖలు మారుతున్నాయన్నారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ వైద్యశాలల్లోపోస్టుల భర్తీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రూపొందించిన మన ఊరు మనబడి పోస్టర్లలో 5 ఫోటోలు ఇల్లందు ప్రభుత్వ పాఠశాలలయే ఉండడం సంతోషకరమన్నారు. మరి కొన్ని పాఠశాలలను మార్చి ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్నాయన్నారు. రాష్ట్రంలోనే ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. కృషి చేసిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ అనుదీప్,మున్సిపల్ చైర్మన్ డివి, డీఈలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ డివి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల,వైస్ చైర్మన్ జానీ మాట్లాడారు. స్థానిక కౌన్సిలర్లు సమస్యలను కలెక్టర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.